Dead Body Parcel: పశ్చిమగోదావరిజిల్లా ఉండి మండలంలో డెడ్‌బాడీ కలకలం రేపింది. ఆ డెడ్‌బాడి పార్శిల్‌లో రావడంతో అంతా భయపడిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏం జరిగిందో పోలీసులు ఆరా తీస్తున్నారు. 


ఉండి మండలం యండగండిలో తులసి అనే మహిళకు ఓ పార్శిల్ వచ్చింది. అందులో ఎలక్ట్రిక్‌ పరికరాలు ఉన్నాయంటూ పార్శిల్ తెచ్చిన వ్యక్తి చెప్పాడు. ఇచ్చి వెళ్లిపోయాడు. కాసేపు ఆగిన తర్వాత పార్శిల్ ఓపెన్ చేసిన తులసి కాళ్లు చేతులు వణికిపోయాయి. 


పార్శిల్‌లో కుళ్లిన డెడ్‌బాడీని చూసిన తులసికి ఏం చేయాలో అర్థం కాలేదు. అందర్నీ పిలిచి చూపించింది. వెంటనే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చింది. తనకు ఓ పార్శిల్ వచ్చిందని అందులో కుళ్లిన డెడ్‌బాడీ ఉందని వివరించింది. 


వెంటనే వచ్చిన పోలీసులు ఏం జరిగిందో ఆరా తీశారు. అందర్నీ విచారిస్తున్నారు. పార్శిల్ ఇచ్చిందెవరు అనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆ డెడ్‌బాడీ ఎవరిది అనే విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. 


ఆ మహిళ ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమె దరఖాస్తును పరిశీలించిన క్షత్రియ సేవా సమితీ ఆమెకు విడతల వారీగా సామాగ్రి పంపిస్తున్నారు. మొదటి విడతలో టైల్స్ పంపించారు. ఇప్పుడు రెండో విడత విద్యుత్ సామగ్రి పంపిస్తున్నట్టు సమాచారం ఇచ్చారు. వచ్చిన పార్శిల్‌లో అవే ఉంటాయని ఆమె ఓపెన్ చేసి చూశారు అంతే షాక్‌ తిన్నారు.