Telangana News: తెలంగాణలో ధరణి పోర్టల్ తీసుకొచ్చి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఈ చట్టాన్ని రద్దు చేసి భూ భారతీ తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ధరణి అక్రమాలపై దృష్టి పెట్టింది. ఈ చట్టం పేరుతో చేసిన కబ్జాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఫోరెన్సిక్‌ విచారణ చేస్తున్నట్టు సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.


లక్షన్నర కోట్ల విలువైన భూముల గోల్ మాల్ 


 ‘ధరణి’ (Dharani)పై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 1 లక్షా 50 వేల కోట్ల విలువ చేసే భూములు చేతులు మారాయని  మంత్రి పొంగులేటి ఆరోపించారు. లిటిగేషన్‌లో ఉన్న భూములను పార్టీ-బీ‌ లో పెట్టి ఆ భూములను సక్రమం చేసుకున్నారని  దోచిన భూములను బీఆర్ఎస్  నేతలు తమ అస్మదీయులకు విచ్చలవిడిగా రిజిస్ట్రేషన్లు చేశారన్నారు.             



Also Read: తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు




కొన్నిచోట్ల భూములకు యజమానులు ఇక్కడ లేరని .. దేశ విభజన సమయంలో పాకిస్తాన్  వెళ్లిపోయారని, అధికారులు నో అబ్జెక్షన్ అని  చెప్పారంటూ ఆ భూములను కూడా కాజేశారని పేర్కొన్నారు. ధరణి వల్ల అక్రమంగా రిజిస్ట్రేషన్ అయిన భూమి ముగ్గురు, నలుగురు వ్యక్తులు మీద మాత్రమే బదలాయింపు అయిందని ఆరోపించారు. ధరణి  పేరుతో నిరుపేదల ఆస్తులను కూడా కొల్లగొట్టారన్నారు.  


ఇరవై ఐదు వేల ఎకరాల అసైన్డ్ భూముల బదలాయింపు                


అలాగే ధరణి వల్ల సుమారు 25 వేల ఎకరాల అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతమయ్యాని ప్రభుత్వం భావిస్తోంది.  ఒక్క ఇబ్రహీంపట్నం పరిధిలోనే 10 వేల ఎకరాలు అన్యాక్రాంతం చేశారని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. అక్కడ ఎకరా రూ.10 కోట్ల విలువ ఉంటుందని న్యాక్రాంతమైన 25 వేల ఎకరాల భూముల మొత్తం విలువ రూ.2.50 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు.                             


Also Read: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం


ప్రత్యేక సిట్ నియమించే అవకాశం                              


ధరణి మసుగులో జరిగిన భూ ఆక్రమనలన్నీ బయట పెడతామని, దీని వెనకాల ఎంత పెద్దవారున్నా వదిలే ప్రసక్తేలేదని ఇప్పటికే పలు సందర్భాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.  గత పదేళ్లలో చోటు చేసుకున్న భూ ఆక్రమణల మీద సమగ్ర విచారణ చేయడానికి సిట్‌   ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీలో దీనిపై ప్రకటన చేయలేదు కానీ రేపో మాపో ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.