తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బుధవారం రాత్రి సమయంలో ఇంటి తలుపులు విరగ్గొట్టి మరీ పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తోట్ల వల్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ రోజు ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి 3వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఎదుట హాజరు పరిచారు. నవంబర్ 2 వరకు పట్టాభికి రిమాండ్ విధించారు. దీంతో మచిలీపట్నం సబ్‌జైలుకు పట్టాభిని తరలించే అవకాశం ఉంది.
కోర్టులో పట్టాభిని హాజరు పరిచిన సమయంలో ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని ప్రభుత్వంలో ఉన్న లోపాలనే ప్రస్తావించానని తెలిపారు. తన ప్రెస్ మీట్ వీడియో క్లిప్పింగ్ పరిశీలించాలంటూ పట్టాభి న్యాయమూర్తిని కోరారు. తనకు నోటీస్ ఇవ్వకుండానే రాత్రి 9.30 గంటల సమయంలో అరెస్ట్ చేశారని తెలిపారు. మధ్యవర్తులు లేకుండానే తనతో పోలీసులు బలవంతంగా సంతకం చేయించారని న్యాయమూర్తికి తెలిపారు. అయితే పోలీసులు కొట్టలేదని న్యాయమూర్తికి పట్టాభి చెప్పినట్లుగా తెలుస్తోంది.
Also Read: పోలీసులకు సిగ్గు లేదా?, నీ కథ ఏంటో చూస్తా..! ఆ పని చేస్తే జగన్‌కి మేమూ సహకరిస్తాం: చంద్రబాబు
అయితే న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఆ తర్వాత పట్టాభి తరఫు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది. పట్టాభిపై 153 ఏ, 505 (2), 504 (ఆర్/ డబ్ల్యూ), 120 బీ కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఎఫ్ఐఆర్ కాపీ రహస్యంగానే ఉంది. మొదట ఆయనపై రాజద్రోహం కేసు పెట్టినట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఆ సెక్షన్లు అందులో లేవని తెలుస్తోంది.
Also Read: సీఎంనా ? సజ్జలనా ? ఎవరిని ఉద్దేశించి పట్టాభి " ఆ పదం " వాడారు ?. పూర్తి ప్రెస్‌మీట్ డీటైల్స్ ఇవిగో..
గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్ విషయంలో ప్రెస్‌మీట్‌లో పట్టాభి చేసిన వ్యాఖ్యలు బూతు మాటలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. పార్టీ కార్యాలయాలపై దాడులు కూడా చేశారు. దీంతో వివాదం రాజకీయం అయింది.
Also Read: అంతా చంద్రబాబే చేశారు.. వైసీపీ మంత్రులు, నేతల ఘాటు విమర్శలు!