Top Headlines In AP And Telangana: 


1. అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వేరే లెవల్‌కు తీసుకెళ్లాలని ప్రభుత్వం ప్లాన్ రెడీ చేస్తోంది. చుట్టుపక్కల ఉన్న నగరాలను కలుపుకొని దీన్ని మెగా సిటీగా రూపకల్పన చేయాలని భావిస్తోంది. కొత్త రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్‌ మతిపోయేలా చేస్తోంది. కోటి మంది జనాభాతో ప్రపంచంలోనే టాప్ మెగా సిటీగా తీర్చిదిద్దాలని స్కెచ్ వేస్తోంది ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే ప్రతిపాదనలు రెడీ చేసింది. అమరావతితోపాటు విజయవాడ, గుంటూరు, మంగళగిరిని కూడా వేరే లెవల్‌క తీసుకెళ్లాలని సీఆర్డీఏను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇంకా చదవండి.


2. విశాఖలో కొడాలి నానిపై ఫిర్యాదు


ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారన్న కారణంతో వైసీపీ నేతలపై ఫిర్యాదులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు అయింది. ఈ కేసుల అంశంపై కోర్టులో పోరాడుదామనుకుంటున్న వైసీపీ నేతలకు తాజాగా కోర్టు చేసిన వ్యాఖ్యలు పెద్ద షాక్ ఇస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న టైంలో చంద్రబాబు, లోకేష్‌పై ఇష్టానుసారంగా మాట్లాడారని చెప్పి మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు అయింది. విశాఖలో ఓ మహిళ ఈ ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకా చదవండి.


3. తెలంగాణ గ్రూప్ - 3 పరీక్ష ప్రారంభం


తెలంగాణ వ్యాప్తంగా 1,365 పోస్టుల కోసం టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌-౩ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్రవ్యాప్తంగా 5.36 లక్షల మంది అప్లై చేసుకుంటే అందులో దాదాపు ఐదు లక్షల మంది పరీక్ష రాశారు. పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులతో రాష్ట్రవ్యాప్తంగా 1401 పరీక్షా కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. ఇవాళ(ఆదివారం) రెండు పేపర్లు, సోమవారం ఒక పేపర్‌కు పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం పది గంటలన నుంచి 12.30 ఒక పేపర్‌ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఇంకొక పరీక్ష నిర్వహిస్తారు. సోమవారం మూడో పరీక్షలను ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మరో పరీక్ష ఉంటుంది. అర గంట ముందే పరీక్ష కేంద్రాల గేట్లను క్లోజ్ చేశారు. ఇంకా చదవండి.


4. బీఆర్ఎస్‌తో పొత్తుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు


మూసీ ప్రక్షాళన రాజకీయం మరోసారి హీటెక్కింది. నిర్వాసిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బస్తీ నిద్ర చేశారు. అనంతరం రేవంత్ సర్కారుపై విమర్శలు చేశారు. దీనికి కాంగ్రెస్ పార్టీ నుంచి అదే స్థాయిలో రియాక్షన్ కూడా వచ్చింది. ఈ సందర్భంగా భవిష్యత్ రాజకీయాలపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ నది విషతుల్యమైపోయిందని అక్కడ ఒక ఆరు నెలలపాటు సామాన్య ప్రజల్లో నివసిస్తే కచ్చితంగా ప్రక్షాళన ఆపేస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి తరచూ సవాళ్లు చేస్తున్నారు. దీన్ని అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. ఇంకా చదవండి.


5. ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ


ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కైలాష్ గెహ్లాట్ రాజీనామా చేశారు. ఈ మరేకు పార్టీ అధినేతఅరవింద్ కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో తన రాజీనామాకు కారణాలు వివరించారు. ఇందులో కీలక ఆరోపణలు చేశారు. పార్టీ స్థాపించినప్పటి విలువలకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు చాలా వ్యత్సాసం ఉందని అభిప్రాయపడ్డారు. అందర్నీ ఏకం చేసిన విలువ నుంచి పార్టీ దూరమై సవాళ్లు ఎదుర్కొంటోందని అన్నారు. ప్రజల పట్ల పార్టీ నిబద్ధతను రాజకీయ ఆశయాలు అధిగమించాయని అన్నారు గెహ్లాట్‌. ఫలితంగా చాలా వాగ్దానాలు నెరవేరకుండా మిగిలిపోయాయని అన్నారు. ఇంకా చదవండి.