ఏపీలో కరోనా కేసుల సంఖ్య నిలకడగా నమోదవుతున్నాయి. కొత్తగా 162 మందికి వైరస్ సోకినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24 గంటల్లో ఒక్క కరోనా మరణం నమోదు కాలేదు. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా.. 31,743 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. వైరస్ నుంచి మరో 186 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,049 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.





కొత్తగా.. అనంతపురంలో 9, చిత్తూరులో 19, తూర్పుగోదావరిలో 22, గుంటూరులో 17, కడపలో 3 కేసులు నమోదయ్యాయి. కృష్ణాలో 15, కర్నూలులో 1, నెల్లూరులో 11, ప్రకాశంలో 3, శ్రీకాకుళంలో 13, విశాఖపట్నంలో 17, విజయనగరంలో 2, పశ్చిమగోదావరిలో 30 కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.


ఆంధ్రప్రదేశ్ లో బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 16కు చేరాయి. కువైట్‌, నైజీరియా, సౌదీ, అమెరికా నుంచి వచ్చిన వారిలో కొత్త వేరియంట్‌ ఉందని.. వైద్యశాఖ పేర్కొంది. తూర్పుగోదావరి జిల్లాలో మూడు కేసులు రాగా.. అనంతపురం జిల్లాలో రెండు,  కర్నూలు రెండు, పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.






 


Also Read: Omicron Cases: ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరోజే.. 10 ఒమిక్రాన్ కేసులు నమోదు


Also Read: Hyderabad New Year : హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటున్నారా ? ఇదిగో ఈ రూల్స్ అన్నింటినీ గుర్తు పెట్టుకోండి..


Also Read: Jagtial: ఇదేం వింత దొంగతనం.. కారులో వచ్చి.. పూల కుండీలు ఎత్తుకెళ్లడమేంటి.. 


Also Read: Khammam Suda: అభివద్ధి చెందుతున్నా.. కదలని సుడా మాస్టర్‌ ‘ప్లాన్‌’.. మోక్షమోప్పుడో!