ఆంధ్రప్రదేశ్ లో బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 16కు చేరాయి. కువైట్‌, నైజీరియా, సౌదీ, అమెరికా నుంచి వచ్చిన వారిలో కొత్త వేరియంట్‌ ఉందని.. వైద్యశాఖ పేర్కొంది. తూర్పుగోదావరి జిల్లాలో మూడు కేసులు రాగా.. అనంతపురం జిల్లాలో రెండు,  కర్నూలు రెండు, పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.






దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 791కి పెరిగింది. దిల్లీలో ఇప్పటివరకు అత్యధికంగా 238 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా మహారాష్ట్రలో 167 కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశంలో 21 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి చెందింది. 


ఒమిక్రాన్ ఆంక్షలు..


ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోన్న కారణంగా పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి రేటు వరుసగా రెండు రోజులు క్రిటికల్ మార్క్‌ను దాటడంతో తాజాగా దిల్లీ సర్కార్ ఆంక్షలు విధించింది.


మరోవైపు ముంబయి నైట్ కర్ఫ్యూ విధించింది. పండుగ సీజన్ కావడంతో పలు ఆంక్షలను కూడా మహారాష్ట్ర సర్కార్ విధించింది.


రాజస్థాన్‌లో..


రాజస్థాన్‌లో కొత్తగా 23 ఒమిక్రాన్ కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 68కి చేరింది. ఈ మేరకు రాజస్థాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అజ్మేర్‌లో 10, జైపూర్ (9), భిల్వారా (2)లో రెండు కేసులు నమోదయ్యాయి.


కొవిడ్ వ్యాప్తి..


దిల్లీలో కరోనా కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. దేశ రాజధానిలో కొత్తగా 496 కరోనా కేసులు నమోదుకాగా ముంబయిలో 1,377 కేసులు వెలుగుచూశాయి. 


దేశంలో కొత్తగా 9,195 కరోనా కేసులు నమోదుకాగా యాక్టివ్ కేసుల సంఖ్య 77,002కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.22గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం.


Also Read: Jagananna Pala Velluva: కృష్ణా జిల్లాలో ‘జగనన్న పాల వెల్లువ’ ప్రారంభం.. ఈ పథకం ప్రయోజనాలు ఏంటంటే..


Also Read: Jagananna Pala Velluva: కృష్ణా జిల్లాలో ‘జగనన్న పాల వెల్లువ’ ప్రారంభం.. ఈ పథకం ప్రయోజనాలు ఏంటంటే..