చిల్లర ఖర్చులకు నగదు... నగలు వంటి పెద్ద దొంగతనాలు ఎందుకు అనుకున్నారో ఏమో జగిత్యాలలో వింత దొంగలు రెచ్చిపోతున్నారు. అదేదో సినిమాల్లో.. ఎదురుగా ఏ వస్తువు కనిపిస్తే.. ఆ వస్తువు మాయం చేసేవాడు కామెడియన్. జగిత్యాల జిల్లాలోనూ అలానే ఏ వస్తువు పడితే ఆ వస్తువు మాయం చేసి సొమ్ము చేసుకుంటున్నారు.. చిన్న చిన్న సొమ్ముకే ఆశ పడుతున్న ఈ దొంగలు చేసే పనులు చూస్తే.. నవ్వు వస్తుందేమో..
జగిత్యాల జిల్లా కేంద్రంలో వింత రకం దొంగతనాలు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. షాప్ లు, చైన్ స్నాచింగ్ లు, ఇళ్లల్లో చోరీలు, దారి దోపిడీ లాంటి దొంగతనాలు మనం వినేవుంటాం. ఆఖరికి దేవుళ్ల ఆలయాలను సైతం వదలని దొంగతనాలను మించి జరిగిన దొంగతనన్ని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు జగిత్యాల జిల్లా ప్రజలు. అసలు విషయానికి వస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక బీట్ బజారు లోని ఓ ఇంట్లో ఇంటి ప్రహరీ గోడపై వివిధ రకాల మొక్కలు ఏర్పాటు చేశారు. అయితే ఆ మొక్కలు రోజుకొకటి మాయమవుతున్నాయి. విషయాన్ని గమనించిన యజమాని సీసీ కెమెరా పూటేజి పరిశీలించగా విస్తూపోయే దృశ్యాలు కనిపించాయి. కారులో వచ్చిన ఓ వ్యక్తి చెట్ల కుండీలు దొంగలించి, ఆయన కారులో వేసుకొని పరార్ అవడం ఫూటేజీలో కనిపించాయి.
ఇలాంటిదే మరో సంఘటన
తిప్పన్నపేట గ్రామ శివారులోని BLN ఫంక్షన్ హాల్ లో 16 లైట్లు మాయమయ్యాయి. మొదట ఎందుకులే ఫిర్యాదు చేయడం అని లైట్ తీసుకున్న యజమాని బూసి రాజేందర్.. ఆ తర్వాత.. ఎందుకైనా మంచిదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఎస్సై అనిల్ ద్విచక్ర వాహనంపై వెళ్తూ పట్టుబడ్డ మత్తన్న పెట్ గ్రామానికి చెందిన గణేష్ లింగాల అనే వ్యక్తి వద్ద ఆ లైట్లు దొరికాయి.. విచారణ చేయగా తానే సదరు ఫంక్షన్ హాల్ లో దొంగతనం చేశాను అని అంగీకరించగా.. అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.