Today Top Headlines In Ap And Telangana:
1. శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం
శ్రీశైలంలో (Srisailam) మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఘాట్ రోడ్డులోని డ్యామ్ సమీపంలో రోడ్డు పక్కన గోడపై కూర్చుని చిరుత (Cheetah) కనిపించింది. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు, భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. మరికొందరు యాత్రికులు రోడ్డుపై కూర్చున్న చిరుతను తమ సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. చిరుత సంచారం నేపథ్యంలో స్థానికులు, శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇంకా చదవండి.
2. సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్
విజయవాడ (Vijayawada) శివారులోని పోరంకిలో ఉన్న మురళీ రిసార్ట్స్‌లో శనివారం సాయంత్రం ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ బాలిక జనంలో నుంచి లేచి సీఎం చంద్రబాబుకు చేతులెత్తి అభివాదం చేస్తూ ఫోటో కావాలని అడిగింది. ఈ క్రమంలో ఆయన ఆమెను వేదికపై పిలిచి ఫోటో దిగారు. కాసేపు మాట్లాడి చదువు, యోగక్షేమాలు తెలుసుకున్నారు. బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఇంకా చదవండి.
3. ఏపీ హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు
ఆడబిడ్డల రక్షణపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలను సంరక్షించడంలో తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఆదివారం ఉదయం ప.గో జిల్లా పాలకొల్లులో 'సేవ్ ది గర్ల్ చైల్డ్' కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టగా.. 'సేవ్ ది గర్ల్ చైల్డ్' పేరుతో 2కె రన్ నిర్వహించారు. రాష్ట్రంలో యువత గంజాయికి బానిసవుతున్నారని అందుకు సినిమాలు సైతం ఓ కారణమని అన్నారు. కొందరు యువత మాదక ద్రవ్యాలను తీసుకోవడమే హీరోయిజంలా భావిస్తున్నారని అన్నారు. ఇంకా చదవండి.
4. తెలంగాణలో కొనసాగుతోన్న గ్రూప్ - 2 పరీక్షలు
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. తొలి రోజు ఉదయం నుంచే పరీక్షా కేంద్రాల వద్ద హడావుడి కనిపించింది. అయితే, నిమిషం నిబంధన కొందరు అభ్యర్థుల కొంప ముంచింది. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. కొన్ని చోట్ల ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు పరీక్షలకు అనుమతించలేదు. దీంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. ముందే స్పష్టమైన ఆదేశాలిచ్చామని.. తామేం చేయలేమని అధికారులు తేల్చిచెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో (Adilabad District) ఒక్క నిమిషం ఆలస్యంగా రావడంతో 16 మంది అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు. ఇంకా చదవండి.
5. మెగాస్టార్ ఇంటికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశం అంతటా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు సంచలనం సృష్టించింది. ఒక రాత్రి జైలులో హీరోని ఉంచడం చర్చనీయాంశం అయింది. జైలు నుంచి వచ్చిన బన్నీని చూడడం కోసం తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు అల్లు వారింటికి క్యూ కట్టారు. ఇప్పుడు అల్లు అర్జున్ మెగాస్టార్ ఇంటికి వెళ్తున్నారు. అల్లు అర్జున్ అరెస్టు వార్త తెలిసిన వెంటనే చిరంజీవి తన షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నారు. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో నటిస్తున్న 'విశ్వంభర' చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చి వెంటనే అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. ఇంకా చదవండి.