Cheetah Movement In Srisailam Dam: శ్రీశైలంలో (Srisailam) మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఘాట్ రోడ్డులోని డ్యామ్ సమీపంలో రోడ్డు పక్కన గోడపై కూర్చుని చిరుత (Cheetah) కనిపించింది. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు, భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. మరికొందరు యాత్రికులు రోడ్డుపై కూర్చున్న చిరుతను తమ సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. చిరుత సంచారం నేపథ్యంలో స్థానికులు, శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, శ్రీశైలంలో ఇటీవల చిరుత సంచారం ఎక్కువైంది.


ఆర్టీసీ బస్టాండ్, ఏఈవో నివాసానికి సమీపంలో చిరుత కనిపించిందనే వార్తలు వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో భక్తులతో పాటు స్థానికులు సైతం అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ, దేవస్థానం ఉన్నతాధికారులు సూచించారు. స్థానికులు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావొద్దని చెప్పారు. మరోవైపు, నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలోనూ చిరుత సంచారం కలకలం రేపుతోంది. గాజులపల్లి సమీపంలో స్థానికులకు చిరుత కనిపించింది. దీనిపై వారు అటవీ, పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు.


Also Read: Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!