Today Top Headlines In Ap And Telangana:
1. పులివెందుల నీటి సంఘాల ఎన్నికల్లో ఘర్షణ
వైఎస్‌ఆర్ జిల్లా పులివెందులలో జరుగుతున్న నీటి సంఘాల ఎన్నికలు ఉద్రిక్తత పరిస్థితులకు కారణమయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన పోలీసులు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. నీటి సంఘాల ఎన్నికల కారణంగా వేముల తాశీల్డార్ కార్యాలయం వద్ద ఘర్షణ జరిగింది. నీటిసంఘాల ఎన్నికల్లో భాగంగా వేముల, పులివెందుల, తొండూరు మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీగా కార్యాలయాలకు వస్తున్నారు. ఇంకా చదవండి.
2. ఉమ్మడి తూ.గో జిల్లా వాసులకు గుడ్ న్యూస్
పర్యాటకంగానే కాకుండా ఆధ్మాతికంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రాకపోకలు సాగించేవారు చాలా ఎక్కువే. ఇంతవరకు హైదరబాద్, చెన్నై, బెంగుళూరు నగరాలకు పరిమితమైన విమానయాన సేవలు మొన్న ముంబై, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ వరకు చేరుకున్నాయి. తాజాగా రాజమహేంద్రవరం టూ ఢిల్లీకి విమానయాన సేవలు ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం నుంచి నేరుగా ఢిల్లీకి విమాన సర్వీసులు ప్రారంభంపై ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చదవండి.
3. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప 2 ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఒకరు ప్రాణం పోయింది. ఈ ఘటనపై చిక్కడపల్లి పీఎస్ లో కేసు నమోదైంది.. ఈ రోజు బన్నీని అరెస్ట్ చేసిన పోలీసులు చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. సంధ్య థియేటర్లో పుష్ప-2 సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఇంకా చదవండి.
4. అల్లు అర్జున్‌పై పెట్టిన సెక్షన్లు ఏవంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ షాక్ అయింది. ఎలాంటి హడావుడి లేకుండా కూల్‌గా హీరో ఇంటికి వెళ్లిన చిక్కడపల్లి పోలీసులు అరెస్టు విషయాన్ని చెప్పారు. రెండు సెక్షన్‌ల కింద అల్లు అర్జున్‌పై కేసులు పెట్టిన పోలీసులు చర్యలు తీసుకున్నారు. భారత న్యాయ సంహిత చట్టాల ప్రకారం 118 (1), భారత న్యాయ సంహిత చట్టాల ప్రకారం 105, రెడ్‌విత్ 3/5 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. 105 సెక్షన్ కింద బెయిల్ రావడం కష్టం. ఇంకా చదవండి.
5. అల్లు అర్జున్ అరెస్టుపై కేటీఆర్ ట్వీట్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'జాతీయ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతకు పరాకాష్ట.! తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది కానీ నిజంగా ఎవరు విఫలమయ్యారు?. అల్లుఅర్జున్‌ని ఓ సాధారణ నేరస్థుడిగా గారూ ప్రత్యేకించి అతను నేరుగా బాధ్యత వహించని విషయానికి పిలవబడడు. గౌరవం & గౌరవప్రదమైన ప్రవర్తనకు ఎల్లప్పుడూ స్థలం ఉంటుంది. ప్రభుత్వ అత్యున్నత ప్రవర్తనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.' అని పేర్కొన్నారు. ఇంకా చదవండి.