KTR On Allu Arjun: జాతీయ అవార్డ్ విన్నింగ్ స్టార్(National Award Winner) అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్(Arrest) పాలకుల అభద్రతకు పరాకాష్ట అన్నారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. RTC క్రాస్ రోడ్స్(RTC Cross Roads) సంధ్య థియేటర్(Sandhya Thietre) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు(Chikkadapalli Police) అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "అభద్రతా భావంతో ఉన్న నాయకుడు ఎల్లప్పుడూ చుట్టూ ఉన్న వారిని నాశనం చేస్తుంటాడు" అంటూ ప్రత్యేకంగా పోస్ట్ పెట్టారు. తొక్కిసలాట ఘటనలో బాధితుల పట్ల తనుకు పూర్తి సానుభూతి ఉంది కానీ ఈ ఘటనలో నిజంగా ఎవరు విఫలమయ్యారు? అని క్వశ్చన్ చేశారు కేటీఆర్. అంతేగాక ప్రత్యేకించి అల్లు అర్జున్ నేరుగా బాధ్యత వహించని విషయానికి ఒక సాధారణ నేరస్థుడిగా పరిగణించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మర్యాద, గౌరవప్రదమైన ప్రవర్తనకు ఎల్లప్పుడూ పరిధి ఉంటుందని, ప్రభుత్వ అత్యున్నత ప్రవర్తనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ పోస్ట్ పెట్టారు. ఇదే లాజిక్ తో వెళితే.. హైదరాబాద్(Hyderabad)లో హైడ్రామా(Hydrama) చేసిన భయం సైకోసిస్‌తో మరణించిన ఇద్దరు అమాయకుల మరణానికి కారణమైన రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని ముందుగా అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు..
Also Read: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్ సీన్స్!
అల్లు అర్జున్ అరెస్ట్ టైమ్ లైన్ ఇదే 11.45 కి అల్లు అర్జున్ ఇంటికెళ్లిన పోలీసులు
12PM కి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పిన పోలీసులు
12.20PM కి జూబ్లీహిల్స్ నివాసం నుంచి బన్నీ తరలింపు
1PM చిక్కడపల్లి పీఎస్ కు అల్లు అర్జున్ తరలింపు
1.15PM కి రిమాండ్ రిపోర్ట్ రెడీ చేస్తున్న పోలీసులు
అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై లంచ్ మోషన్ విచారణ జరపాలని హైకోర్టు ను కోరారు న్యాయవాదులు. జస్టిస్ జువ్వాడి శ్రీదేవి కోర్టులో మెన్షన్ చేసిన న్యాయవాదులు నిరంజన్ రెడ్డి అశోక్ రెడ్డి...సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆర్దర్స్ ఇవ్వాలని కోరారు. దీనిపై మధ్యాహ్నం రెండున్నరకు విచారణ చేపట్టనున్నారు...
Also Read: హీరో అల్లు అర్జున్ అరెస్టు- సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చర్యలు
కాసేపట్లో గాంధీ హాస్పిటల్ లో బన్నీకి వైద్య పరీక్షల చేయనున్నారు . మరోవైపు విశ్వంభర షూటింగ్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ ర్దదుచేసుకుని హుటాహుటిన చిక్కడపల్లి పీఎస్ కు బయలుదేరారు.
అల్లు అర్జున్ అభిమానులు భారీగా చిక్కడపల్లి పీఎస్ కు తరలివెళ్తున్నారు...
పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట సమయంలో ఓ మహిళ మృతిచెందింది...ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. డిసెంబరు 13 మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు
Also Read: అల్లు అర్జన్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటీ?