Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్ సీన్స్!

సంధ్య ధియేటర్ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్
Download ABP Live App and Watch All Latest Videos
View In App
పోలీసులు తీసుకెళ్లేందుకు రావడంతో కంగారుపడుతున్న స్నేహకి ధైర్యం చెబుతున్న అల్లు అర్జున్

అరెస్ట్ వేళ అల్లు అర్జున్ లో ఏ మూలనా భయం లేదు.. చాలా రిలాక్స్ గా ఉన్నాడు.. కూల్ గా కాఫీ తాగి మరీ పోలీసులతో వెళ్లాడు
అల్లు అరవింద్ కూడా అల్లు అర్జున్ తోనే ఉన్నాడు.. తనయుడితో పాటూ కారెక్కిన తండ్రిని వద్దని వారించాడు బన్నీ.. ఏం జరిగినా తాను చూసుకుంటానని ధైర్యం చెప్పాడు
అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలిసి ఒక్కసారిగా అల్లు అరవింద్ కి కాల్స్ వెల్లువెత్తాయ్.. ఈ ఫొటోలో పోన్ మాట్లాడుతున్న అల్లు అరవింద్ ని గమనించవచ్చు
ఈ ఫొటోలో అల్లు అర్జున్, అల్లు అరవింద్ తో పాటూ బన్నీ సోదరుడు అల్లు శిరీష్ కూడా కంగారుగా కనిపిస్తున్నాడు
బన్నీని అరెస్ట్ చేసి తీసుకెళ్లడంతో షాక్ అయిన స్నేహ అలా ఉండిపోయింది
భార్య స్నేహారెడ్డి డల్ అయిపోవడం చూసి అల్లు అర్జున్ వచ్చి ధైర్యం చెప్పాడు.. చిన్న పిల్లని ఓదార్చినట్టు ఓదార్చాడు
టెన్షన్ పడుతున్న స్నేహకు ప్రేమగా ముద్దిచ్చి ధైర్యం చెప్పాడు బన్నీ
బన్నీని అరెస్ట్ చేసిన పోలీసులు చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు...
అల్లు అర్జున్ మెహంలో ఎలాంటి కంగారు లేదు..నవ్వుతూ చాలా రిలాక్స్ గా కనిపించాడు
సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనలో బన్నీపై పలు sections కింద కేసులు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు