యూట్యూబ్ మానిటైజేషన్ ప్రోగ్రాం మరింత సులభం అయింది. అంటే యూట్యూబ్ ద్వారా సంపాదించడం ఇంకా ఈజీ కానుందన్న మాట. మానిటైజేషన్‌కు అవసరమైన సబ్‌స్క్రైబర్ల సంఖ్యను 1000 నుంచి 500కు తగ్గించారు. గడిచిన 90 రోజుల్లో కనీసం మూడు పబ్లిక్ వీడియోలు ఉండాలి. వాచ్ అవర్స్‌ను కూడా నాలుగు వేల వాచ్ అవర్స్ నుంచి మూడు వేల వాచ్ అవర్స్‌కు తగ్గించారు. గత 90 రోజుల్లో షార్ట్స్‌కు మూడు మిలియన్ వ్యూస్ ఉండాలి. సూపర్ థ్యాంక్స్, సూపర్ షార్ట్స్, సూపర్ ఛాట్ వంటి ఫీచర్లు అన్‌లాక్ చేశారు. ప్రస్తుతానికి అమెరికా, యూకే, కెనడా, తైవాన్, దక్షిణ కొరియాల్లో దీన్ని అమలు చేశారు. త్వరలో మిగతా దేశాల్లోకి కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. యూట్యూబ్ షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రాం కూడా తీసుకురానుంది.