ప్రపంచంలో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ ఏదంటే?

Published by: Jyotsna

కొన్ని ప్రత్యేక నంబర్ ప్లేట్లు లక్షల నుండి కోట్ల రూపాయల ధర పలుకుతాయని తెలుసా.

​ప్రపంచంలో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ 55 మిలియన్ దిర్హామ్‌లకు (సుమారు ₹122.6 కోట్లు) అమ్ముడైంది.

2023లో దుబాయ్‌లో జరిగిన చారిటీ వేలంలో P7 నంబర్ ప్లేట్ అధిక ధర పలికింది.

ఈ నంబర్ ప్లేట్‌లో P అక్షరం చిన్నగా, 7 సంఖ్య పెద్దగా కనిపిస్తుంది

అంతకు ముందు 2008లో అబుదాబిలో 1 నంబర్ ప్లేట్ 52.2 మిలియన్ దిర్హామ్‌లకు అమ్ముడైంది.

దుబాయ్‌లోని వ్యాపారవేత్త 2016లో D5 నంబర్ ప్లేట్‌ను $9.6 మిలియన్ (₹73.5 కోట్లు)కు కొనుగోలు చేశారు.

అంతకు ముందు F1 నంబర్ ప్లేట్, 2008లో బ్రిటన్‌లో కొనుగోలు చేయబడింది, దాని విలువ సుమారు $20 మిలియన్ (₹152 కోట్లు)గా అంచనా.

కాలిఫోర్నియాకు చెందిన MM నంబర్ ప్లేట్ విలువ $24.3 మిలియన్ (₹185 కోట్లు).

దుబాయ్‌లో 9 నంబర్ ప్లేట్ 2015లో $2.8 మిలియన్ (₹21 కోట్లు)కు అమ్ముడైంది.