చాలా మందికి విమాన ప్రయాణం మరిచిపోలేని అనుభూతి.



కానీ కొన్ని విమానాశ్రయాలకు చేరుకోవడమే థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌



అక్కడ టేకాఫ్, ల్యాండింగ్ రెండూ సాహసమే



నేపాల్‌లోని లుక్లా విమానాశ్రయం 600 మీటర్ల లోతైన లోయ వద్ద రన్‌వే ఉంది. వెదర్ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది.



ఫ్రాన్స్‌లోని కోర్చెవెల్ విమానాశ్రయం ఆల్ప్స్ సమీపంలో ఉంది. వాలుగా ఉండే మంచు ప్రాంతంలో ప్లేన్‌ ల్యాండ్ చేయడం సవాలే



హోండురాస్ టోన్‌కాంటిన్ విమానాశ్రయం కొండల మధ్య ఉంటుంది. ఇక్కడ ల్యాండింగ్, టేకాఫ్‌ రెండూ డేంజర్‌



తీరప్రాంతంలో స్కాట్లాండ్‌లోని బార్రా అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడ రన్‌వే నీటిలో మునిగి తేలుతుంది.



లక్షద్వీప్‌లోని అగట్టి ఏరోడ్రోమ్ ఎయిర్‌పోర్టు ఇండియాలోనే ప్రమాదకరమైనది.



బ్యాంకాక్‌లోని డాన్ ముయాంగ్ విమానాశ్రయం గోల్ఫ్ కోర్సు మధ్యలో ఉంది.



న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్ విమానాశ్రయం రన్‌వే 6,351 అడుగుల పొడవు ఉంటుంది . రెండు వైపులా సముద్రం ఉంటుంది.