మైక్ టైసన్‌కు 13 ఏళ్లు వచ్చే సరికి 30 సార్లు అరెస్టయ్యాడు !



1992లో చివరి సారిగా జైలుకెళ్లి 1995లో విడుదలయ్యాడు. మిస్ బ్లాక్ బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొన్న మహిళను రేప్ చేశారన్న నేరంపై జైలుకెళ్లాడు.



ఎప్పుడు జైలుకెళ్లినా మంచి ప్రవర్తన కారణంగానే రిలీజ్ అవుతాడు. అతను మూడు బెంగాల్ టైగర్లను పెంచుకునేవాడు. లక్షల డాలర్లు వాటి పోషణకు ఖర్చు పెట్టేవాడు.



20 ఏళ్లకే హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ అయ్యాడు.



టైసన్‌కు తండ్రెవరో తెలియదు. తల్లి 16వ ఏట క్యాన్సర్‌తో చనిపోయింది. బాక్సింగ్ ట్రైనరే ఆయనకు అన్నీ !



మొత్తంగా మూడు సార్లు పెళ్లిళ్లు చేసుకున్న మైక్ టైసన్‌కు ఏడుగురు పిల్లలు. అందులో ఒకర్ని దత్తత తీసుకున్నారు.



కోట్ల డాలర్లు సంపాదించినా ఖర్చులపై అదుపులేకపోవడంతో 2003లో దివాలా తీశాడు. బంగారం బాత్ టబ్‌ను వాడేవాడు చివరికి రోడ్డున పడాల్సి వచ్చింది.



టైసన్ ముఖం మీద టాటూకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. మామలుగా అయన హార్ట్ టాటూ వేయించుకోవాలనుకున్నారు. చివరికి అలా వచ్చింది.



2005లోనే టైసన్ రిటైరయ్యాడు. ఓ బాక్సింగ్ పోటీలో ప్రత్యర్థి చెవి కొరికి చరిత్రలో నిలిచిపోయాడు. అందుకే ఆయన దిగ్గజ బాక్సరే కానీ బ్యాడ్ బాయ్‌గా నిలిచిపోయాడు.