జపాన్​లో అతిపెద్ద సునామీ ఎప్పుడు వచ్చిందో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

జపాన్​లో అతిపెద్ద సునామీ మార్చి 11, 2011న వచ్చింది. ఈ సునామీ జపాన్ చరిత్రలో అత్యంత వినాశకరమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటి.

Image Source: pexels

మార్చి 11, 2011న జపాన్ లో 90 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ భూకంప కేంద్రం సముద్రంలో తోహోకు ప్రాంతానికి దగ్గరగా ఉంది.

Image Source: pexels

భూకంపం వచ్చిన వెంటనే ఒక పెద్ద సునామీ వచ్చింది. సునామీ అలలు కొన్ని ప్రదేశాలలో 40 మీటర్ల వరకు ఎత్తులో వచ్చాయి.

Image Source: pexels

ఆ సునామీ జపాన్ ఈశాన్య తీరంలో అత్యంత ప్రభావం చూపింది.

Image Source: pexels

ఆ సమయంలో ఫుకుషిమా దైచి అణు విద్యుత్ ప్లాంట్లో తీవ్ర నష్టం జరిగింది.

Image Source: pexels

సుమారు 20,000 మంది మరణించారు. కొందరు అదృశ్యమయ్యారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. చాలా ఆస్తి నష్టం జరిగింది.

Image Source: pexels

ఇది జపాన్ ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద ఎదురుదెబ్బ. ప్రపంచం నలుమూలల నుంచి పలు దేశాలు జపాన్‌కు సహాయం చేశాయి.

Image Source: pexels

ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఒక పెద్ద సమస్యగా మారింది.

Image Source: pexels

2011 సంవత్సరంలో వచ్చిన ఈ సునామీ ఇంకా జపాన్ ప్రజల గుండెల్లో భయాన్ని పుట్టిస్తుంది.

Image Source: pexels