వన్ స్టాప్ సెంటర్ స్కీమ్
ప్రైవేట్‌, పబ్లిక్‌ ప్లేసెస్‌లో మహిళలపై జరుగుతున్న హింస నివారించడానికి తీసుకొచ్చిన పథకం. వారికి వైద్య, చట్టపరమైన, సైకలాజికల్‌ మద్దతు ఇస్తారు.


మహిళా హెల్ప్‌లైన్ పథకం
మహిళపై హింసను నివారించడానికి 181 నెంబర్‌తో ఓ టోల్‌ఫ్రీ నెంబర్‌ తీసుకొచ్చింది కేంద్రం. 112 ఎమర్జెన్సీ నెంబర్‌కి కూడా ఫోన్ చేయవచ్చు.


ఉజ్వల్
అక్రమ రవాణా నివారణ, రెస్క్యూ, పునరావాసం, లైంగిక దాడికి గురైన బాధితుల పునరావాసం కోసం పెట్టిన పథకం


సఖి నివాస్‌
ఉద్యోగాలు చేస్తున్న మహిళలు ఉండేందుకు హాస్టల్స్ ఫెసిలిటీ కల్పించడం ఈ స్కీమ్ ఉద్దేశం. వారితోపాటు పిల్లలు కూడా ఉండేందుకు అవకాశం ఇస్తారు.


స్వాధార్ గృహ్
ప్రకృతి విపత్తుల్లో సర్వం కోల్పోయిన మహిళలకు, జైలు నుంచి విడుదలై ఎవరూ లేని మహిళలకు, ప్రాణాంతక వ్యాధులు వచ్చి ఎవరూ పట్టించుకోని మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది.


నారీ శక్తి పురస్కార్
మహిళల కోసం అద్భుత సేవలు అందించే వారికి ఏటా ఈ నారీ శక్తి పురస్కార్‌ను అందిస్తున్నారు. ఈ 20 పురస్కారాల్లో రాణి రుద్రమదేవి అవార్డు కూడా ఉంది.


ఉమెన్ హెల్ప్‌లైన్ స్కీం
దీన్ని మిషన్ శక్తిలో భాగంగా అమలు చేస్తున్నారు. మహిళలకు రక్షణ, భద్రత కల్పిచండంతోపాటు వారి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కూడా ఈ మిషన్‌లో భాగమే.


మహిళా పోలీస్‌ వాలంటీర్
హరియానాలోని రెండు గ్రామాల్లో మహిళా పోలీస్ వాలంటీర్‌లను కేంద్రం నేరుగా నియమించింది. అక్కడ మహిళలపై జరిగే దాడులు, ఎదుర్కొంటున్న ఇతర సమస్యల పరిష్కారానికి దీన్ని 2016-17లో తీసుకొచ్చారు.


మహిళా శక్తి కేంద్రం(MSK)
మహిళల్లో ఉన్న డిజిటల్ నిరక్షరాస్యత తగ్గించి, వారి ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రతి అంగన్‌వాడీ కేంద్రంగా ఈ మహిళా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని 2016-17లో కేంద్రం భావించింది.


బేటీ బచావో బేటీ పఢావో పథకం
ఆడ పిల్లల సంతతి పెంచేందుకు,,, లింగనిష్పత్తిలో వ్యత్యాసాన్ని తగ్గించేందుకు తీసుకొచ్చిన పథకం.