‘ఉమెన్స్ డే’ రోజు మీ ఇంటి మహిళలను ఎలా సర్‌ప్రైజ్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇదిగో ఇలా చేయండి. మహిళలకు ఎక్కువ దుస్తులు ఇష్టం. కాబట్టి, వారికి నచ్చిన రంగు చీరలు లేదా డ్రెస్‌లను గిఫ్టుగా ఇవ్వండి. మహిళలకు ఆభరణాలు కూడా చాలా ఇష్టం. అంత బడ్జెట్ లేకపోతే లేడీస్ వాచ్ లేదా ఫిట్‌నెట్ వాచ్ ఇవ్వండి. అమ్మ లేదా భార్యకు.. వంటగదిలో పాటలు వింటూ పని చేసుకోడానికి బుల్లి రేడియోని కొనివ్వండి. మహిళలకు ఇష్టమైన గిఫ్ట్ కొనడమంటే పెద్ద టాస్కే. కాబట్టి, వారినే షాపింగ్‌కు తీసుకెళ్లండి. షాపింగ్‌లో వారికి నచ్చిన వస్తువు కొనుక్కోమని బంపర్ ఆఫర్ ఇవ్వండి. ఫుల్ ఖుష్ అవుతారు. షాపింగ్ తర్వాత లంచ్ లేదా డిన్నర్ ప్లాన్ చేయండి. ఆ రోజు మరపురాని రోజవ్వుతుంది. మీ భార్యకు ఈ రోజు సెలవు ఇచ్చి.. విహార యాత్రకు తీసుకెళ్లండి. ఆమెతో రోజంతా సరదాగా గడపండి. ప్రియురాలికి మేకప్ కిట్ ఇవ్వండి, లేదా థీమ్ పార్క్, మూవీకి తీసుకెళ్లి ఆమెను సంతోష పెట్టండి. ‘ఆమె’ అంటే మీకు ఎంత ఇష్టమో చెబుతూ మీ స్వహస్తాలతో అందమైన లేఖ రాసివ్వండి. Images and Videos Credit: Pixels