మేషం అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందుతారు. ప్రేమికులకు ఈ రోజు చాలా మంచిరోజు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మెరుగ్గా రాణిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు కలిసొచ్చే సమయం.
వృషభం ఉద్యోగులు కార్యాలయంలో శ్రద్ధగా పనిచేస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు శుభసమయం. ఇంటా-బయటా మీ గౌరవం పెరుగుతుంది. ఇనుము వ్యాపారులు లాభపడతారు.
మిథునం కార్యాలయంలో పెద్ద బాధ్యత నెరవేరుస్తారు. తలపెట్టిన పనులు పూర్తికావు. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. తలనొప్పి, జ్వరంతో ఇబ్బంది పడొచ్చు. అపరిచితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
కర్కాటకం ఈరోజంతా సంతోషంగా ఉంటారు. వైద్య వృత్తితో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత ర్యాంకులు పొందుతారు. ఆదాయం, వ్యయాల మధ్య సమతుల్యతను కాపాడుకోండి.
సింహం ఏ పని చేసినా జీవిత భాగస్వామి సలహాను పరిగణలోకి తీసుకోండి. ఈరోజు పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. రాబోయే రోజులకు సంబంధించి మీరు కొన్ని అర్థవంతమైన నిర్ణయం తీసుకుంటారు.
కన్య కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కొత్త ప్రాజెక్టుల్లో పని చేయడానికి ప్లాన్ చేస్తారు. మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. పనికిరాని వాటిపై దృష్టి పెట్టొద్దు.
తుల అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి సలహా తీసుకోండి. రోజు ప్రారంభం మీకు శుభప్రదంగా ఉంటుంది. మీకు కేటాయించిన పనులను విస్మరించవద్దు. పని ఒత్తిడి పెరగుతుంది. కీళ్ల నొప్పులు, తలనొప్పి ఫిర్యాదులు ఉండొచ్చు.
వృశ్చికం వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. ఆగిపోయిన పనులు ఈరోజు పూర్తవుతాయి. వ్యాపారాల్లో భాగస్వాముల సహకారం లభిస్తుంది. బిజినెస్ ప్లానింగ్ చేస్తారు. ఈ రోజు జాగ్రత్తగా లావాదేవీలు జరపండి. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి.
ధనుస్సు మీకు ఇష్టమైన పని చేసే అవకాశం మీకు లభిస్తుంది. మీరు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ఓ శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేస్తారు.
మకరం కొన్ని పనులు ఒంటరిగా చేయాల్సి ఉంటుంది. ఆఫీసులో అధికారులతో సమావేశం ఉంటుంది. సంతానం విజయంతో సంతోషాన్నిస్తుంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. శుభవార్తలు వింటారు.
కుంభం ఈరోజు మంచి రోజు. మీరు మీ స్నేహితులతో సంతోషం సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే నిర్ణయాలు తీసుకుంటారు. విద్యుత్ వ్యాపారులు లాభపడతారు. వేరేవారి మాటల్లో తల దూర్చకండి.
మీనం ఈ రోజంతా గందరగోళంగా ఉంటుంది. మీపై మరింత ప్రతికూలత ఉంటుంది. తలనొప్పి, అలసట కారణంగా మీ పనులను నిరాటంకంగా పూర్తి చేస్తారు. రిస్క్ తీసుకోవద్దు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.