పిల్లల్ని కనేందుకు సరైన వయసు ఏది? పెళ్లి చేసుకున్న జంటలు పిల్లల్ని మాత్రం లేటుగా కనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలంటే సరైన వయసులో కనాల్సిందేనని చెబుతున్నాయి వైద్య పరిశోధనలు. 21 ఏళ్ల నుంచే ఆడవాళ్ల శరీరం పిల్లల్ని కనేందుకు సిద్ధంగా ఉంటుంది. అలాగని 21 ఏళ్లకే పిల్లల్ని కనమని కాదు, 25 ఏళ్ల నుంచి 30 లోపు పిల్లల్ని కంటే ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారు. ఆరోగ్యకరమైన పిల్లలు కావాలనుకుంటే 30 లోపు కనమని సిఫారసు చేస్తున్నారు వైద్యులు. 35 ఏళ్లు దాటాక వచ్చే గర్భం హై రిస్క్ కింద భావిస్తారు వైద్యులు. వారికి ప్రత్యేక జాగ్రత్తలు తప్పవు. 30 లోపు ఆడవారిలో ప్రసవం సులువుగా అవుతుంది. రిస్క్ లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.