తిన్న వెంటనే చల్లని నీళ్లు తాగితే... ఈ సమస్యలు తప్పవు

చాలా మంది భోజనం చేసిన వెంటనే చల్లని పానీయాలు తాగుతుంటారు.

అలా ఆహారంతో పాటూ చల్లని డ్రింకులు, నీళ్లు తాగడం ప్రమాదకరం.

చల్లని నీళ్ల వల్ల కొన్ని రకాల ఆరోగ్యసమస్యలు దాడి చేసే అవకాశం ఉంది.

భోజనం చేశాక చల్లని నీరు తాగితే శరీరంలో కొవ్వు పదార్థాలు అధికంగా నిల్వ అవుతాయి.బెల్లీ ఫ్యాట్ పెరిగే అవకాశం ఉంది.

చల్లటినీళ్లతో కలిపి ఆహారంలోని కొవ్వు గట్టిపడుతుంది,జీర్ణం కాదు. దానివల్ల అజీర్తి సమస్యలు మొదలవుతాయి.

చల్లని నీరు శరీరం జీవక్రియను చెడగొడుతుంది. దీని వల్ల శరీర ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు కలుగుతుంది. అవయవాలకు ఆక్సిజన్ సరిగా అందనివ్వదు.

చల్లని నీరు మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. క్రియలను స్తంభింపజేస్తుంది. మైకం వచ్చేలా చేస్తుంది.

హృదయ స్పందనల్లో తేడా వచ్చేలా చేస్తుంది చల్లటినీరు. గుండె నరాల పనితీరును దెబ్బతీస్తుంది.

చల్లటి నీరు తాగడం వల్ల దాహం తీరదు, సరికదా ఇంకా పెరిగిపోతుంది.

తిన్న ఆహారంలోని పోషకాలేవి శరీరానికి సక్రమంగా చేరకుండా చేస్తుంది కూల్ వాటర్.