తెలుగులో 'ఆర్య 2', 'డార్లింగ్', 'మొగుడు' వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రద్ధా దాస్. ఆ తరువాత బాలీవుడ్ లో, బెంగాలీలో కొన్ని సినిమాలు చేసింది కానీ ఏవీ వర్కవుట్ కాలేదు. తెలుగులో కూడా అవకాశాలు తగ్గిపోయాయి. కొన్ని సినిమాల్లో బోల్డ్ రోల్స్ లో కనిపించినప్పటికీ ఆమె అవకాశాలైతే ఇవ్వలేదు దర్శకనిర్మాతలు. తెలుగులో ఆమె చివరిగా 'ఏక్ మినీ కథ' అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఒకట్రెండు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ రీసెంట్ గా తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. గోవాలో తన స్నేహితులతో కలిసి బాగా ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.