వైట్ రైస్ నుంచి బ్రౌన్ రైస్ కు మారితే చాలా లాభాలుననాయని నిపుణులు చెబుతున్నారు. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ కనుక డయాబెటిక్స్ షుగర్ స్థాయిల అదుపులో ఉంచేందుకు దోహదం చేస్తంది. బ్రౌన్ రైస్ లో ఉండే మాంగనీస్ వల్ల కొవ్వుల సంశ్లేషణకు దోహదం చేస్తుంది. కనుక కొవ్వు తగ్గి బరువు తగ్గుతారు. బ్రౌన్ రైస్ లోని ఫైబర్ వల్ల మలబద్దకం నివారించబడుతుంది. బ్రౌన్ రైస్ కోలైటిస్ కూడా మంచి పరిష్కారం. హానికారక కొలెస్ట్రాల్ బ్రౌన్ రైస్ తో తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వీటిలోని అమినోబ్యూట్రినిక్ యాసిడ్.. అల్జీమర్స్ వంటి నాడీ సంబంధ సమస్యలను నివారిస్తుంది. బ్రౌన్ రైస్ లో మెలటోనిన్ ఉంటుంది. అందువల్ల నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. మొలకెత్తిన బ్రౌన్ రైస్ లో గ్లుటామైన్, గ్లిజరిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి యాంటీ డిప్రెసెంట్‌గా కూడా పనిచేస్తాయి. Representational Image : Pexels