అవిసె గింజలను తింటే ఎంత ఆరోగ్యమో



అవిసెగింజలు తినేవారి సంఖ్య తక్కువే. కానీ వాటిని తింటే ఎంత ఆరోగ్యమో.



అవిసె గింజల ధర చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరలోనే ఉంటాయివి.



వీటిలో ప్రొటీన్లు, కార్బో హైడ్రేట్లు, విటమిన్ బి1, విటమిన్ బి6, పొటాషియం, ఐరన్, క్యాల్షియం, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.



అవిసె గింజలు తినడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది.



మెనోపాజ్ దశలో ఉన్న వారు అవిసె గింజలను తరచూ తింటే ఎంతో మంచిది. ఆ సమయంలో వచ్చే సమస్యలు రాకుండా ఉంటాయి.



అవిసె గింజలు తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యత సమస్య కూడా తగ్గుతుంది.



ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఈ గింజల్లో అధికంగా ఉంటాయి. కాబట్టి మెదడుకు, గుండెకు కూడా ఎంతో మంచిది.



మానసిక ఆరోగ్యానికి కూడా అవిసె గింజలు తినడం చాలా అవసరం.