పచ్చి ఉల్లి ముక్కల్లో ఫ్రాక్టాన్లు ఉంటాయి. అందువల్ల కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు వస్తాయ్.

ఐబీఎస్ వంటి సున్నితమైన జీర్ణవ్యవస్థ కలిగిన వారికి మరింత ఇబ్బందికరంగా పరిణమించవచ్చు.

లోవర్ ఈసోఫేగల్ స్పింక్టర్‌లో సమస్య ఉన్న వారికి ఆసిడ్ రిఫ్లక్స్ సమస్య తీవ్రమై గుండెల్లో మంట వస్తుంది.

ఉల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు ఉండడం వల్ల శ్వాసలో ఆ దుర్వాసన ఉండిపోతుంది.

కొంతమందిలో ఉల్లిపాయలు అలెర్జీ కలిగిస్తాయి. ఇది చర్మం మీద దురద, దద్దుర్లు కలిగించవచ్చు.

మరికొంత మందిలో ఇన్ఫ్లమేషన్ నుంచి శ్వాసలో ఇబ్బంది వంటి తీవ్ర పరిణామాలు కూడా రావచ్చు.

ఉల్లి వల్ల అలెర్జీకి గురైతే మాత్రం వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

Representational Image : Pexels