బిడ్డకు తల్లిపాలు ఎందుకు ఇవ్వాలి? తల్లి పాలు ఇవ్వడం వల్ల బిడ్డకు మాత్రమే కాదు, తల్లికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తల్లిపాలు బిడ్డకు వారికి కావాల్సిన ఉష్ణోగ్రత వద్ద లభిస్తాయి. వేడిగా ఉండవు, అలాగని మరీ చల్లగా ఉండవు. పాలలో ఎలాంటి హానికరమైన సూక్ష్మక్రిములు, వైరస్ , బ్యాక్టిరియాలు ఉండవు. తల్లిపాలు తాగిన పిల్లల మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. వారు చదువులో బాగా రాణిస్తారు. ఈ పాలలో విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ బిడ్డ ఎదుగుదలకు చాలా అవసరం. వయసుకు తగ్గ బరువు పిల్లలు ఎదగాలంటే తల్లిపాలు చాలా ముఖ్యం. అధికబరువు బారిన పడకుండా ఉంటారు పిల్లలు. పాలు ఇవ్వడం వల్ల తల్లికి రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుంది. త్వరగా తల్లులు చాలా బరువు తగ్గుతారు. తల్లిపాలు తాగడం వల్ల తల్లీ బిడ్డల మధ్య అనుబంధం, ప్రేమ ఎంతో పెరుగుతాయి.