పిల్లలు మట్టి, బలపాలు ఎందుకు తింటారు?



కొంతమంది పిల్లలు మట్టి, బలపాలు, బియ్యం, చాక్ పీసులు వంటివి తింటూ ఉంటారు.



ఇలా ఆహారం కాని వాటిని తినాలనిపించేలా చేయడానికి కారణం ‘పైకా’ అనే డిజార్డర్. ఇదొక మానసిక రుగ్మత.



కొన్ని రకాల పోషక లోపాలు ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.



రక్తహీనత సమస్యతో ఉన్నవారు ఇలా బియ్యం, పలక పుల్లలు, చాక్ పీసులు, మట్టి వంటివి తినడానికి ఆసక్తి చూపిస్తారు.



మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారు కూడా ఇలాంటివి తినడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.



జింక్, కాల్షియం, ఐరన్ వంటి పోషక లోపాలు ఉన్నవారిలో కూడా మట్టి, బలపాలు తినాలన్న కోరిక అధికంగా ఉంటుంది.



గర్భిణులకు మట్టి తినాలనిపించడం, పలక పుల్లలు, సున్నం తినాలనిపించడం జరుగుతూ ఉంటాయి. అలా అనిపించినప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు.



ఒకసారి వైద్యులను సంప్రదించి పోషకాహార లోపం ఏదైనా ఉందేమో తెలుసుకోవడం చాలా అవసరం.