నల్ల టమోటాలు తింటే ఎంత ఆరోగ్యమో



టమాటోలలో నల్ల రకం టమోటోలు కూడా ఉన్నాయి. ఇవి చూడడానికి నల్లగా నిగనిగలాడుతాయి.



ఎర్ర టమాటోలతో పోలిస్తే ఈ నల్ల టమాటాలే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.



ఈ నల్ల టమాటాలను ఇండిగో రోజ్ అని పిలుస్తారు. వీటిని అధికంగా ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలలో సాగు చేస్తున్నారు.



ఎర్ర టమాటోలతో పోలిస్తే ఈ నల్ల టమోటోలు త్వరగా చెడిపోవు. ఇందులో విత్తనాలు చాలా తక్కువగా ఉంటాయి.



క్యాన్సర్‌ని అడ్డుకునే శక్తి ఈ నల్ల టమాటోలకి ఉంది. అందుకే క్యాన్సర్ రోగులు వీటిని తినాలి.



వీటిని మన దేశంలో తక్కువ వినియోగిస్తారు. వీటిని కూరలో వేస్తే కూరంతా నల్లగా మారిపోతుంది, ఆ రంగు నచ్చక ఎరుపు టమోటాలనే తింటూ ఉంటారు మన దేశంలో.



ఈ టమోటోలలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. విటమిన్ ఏ కూడా లభిస్తుంది.



దీనిలో లైకోపీన్, బీటా కెరటిన్, విటమిన్ సి, ఫ్లావనోయిడ్లు అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా దీనిలో ఎక్కువే.