వంకాయ తింటే కొంతమందికి వెంటనే అలర్జీ వస్తుంది.



వంకాయ వల్ల వచ్చే ఫుడ్ అలర్జీని తేలికగా తీసుకుంటే ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు.



అమెరికన్ అకాడమీ ఆఫ్ అలర్జీ ప్రకారం ఆస్తమా, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళలో
వంకాయ వల్ల కలిగే అలర్జీ చాలా ప్రమాదకరం.


సున్నితనమైన చర్మ రకం కలిగిన వాళ్ళు వంకాయ తినడం వల్ల దద్దుర్లు వస్తాయి.



వంకాయ అలర్జీ అనేక సందర్భాల్లో అనాఫిలాక్సిన్ కు కారణమవుతుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు పడతారు.



వంకాయ అలర్జీ ఉన్న వాళ్ళకి కూడా నాలుక, పెదవులు, గొంతు వాపు ఏర్పడుతుంది.



వంకాయలో నాసునిన్ ఉంటుంది. ఇది ఒక రకమైన ఫైటోకెమికల్.
ఫుడ్ అలర్జీ ఉన్న వాళ్ళు వంకాయ తీసుకున్నప్పుడు అత్యల్ప రక్తపోటుని ఎదుర్కొంటారు.


ఇది మాత్రమే కాదు వీటిలో ఉండే ఆక్సీలెట్స్ కిడ్నీలో రాళ్ళని కూడా ఏర్పరుస్తుంది.



టొమాటో, బంగాళాదుంప, పెప్పర్ అంటే అలర్జీ కలిగిన వాళ్ళకి వంకాయ తిన్న కూడా పడదు.