బ్రేక్‌ఫాస్ట్ ఉదయం 8 గంటల్లోపే తినేయాలట



చాలా మంది బ్రేక్‌ఫాస్ట్ ఉదయం 10 తరువాత తింటూ ఉంటారు. అప్పుడు తినడం వల్ల ఉపయోగం లేదు.



అధ్యయనం ప్రకారం ఉదయం 9 గంటల తరువాత బ్రేక్ ఫాస్ట్ చేసినవారితో పోలిస్తే ఉదయం 8 గంటల్లోనే చేస్తే ఎంతో ఆరోగ్యకరం.



ఇలా ఉదయం 8 గంటల్లోపే బ్రేక్ ఫాస్ట్ తినేవారిలో మధుమేహం వచ్చే అవకాశం తగ్గుతుంది.



తిండి వేళలు కూడా మధుమేహం వచ్చే అవకాశాలపై ప్రభావం చూపిస్తాయి.



లక్ష మందికి పై ఆహారపు అలవాట్లను విశ్లేషించడం ద్వారా ఈ విషయాన్ని కనిపెట్టారు అధ్యయనకర్తలు.



ఉదయం 8 గంటల్లోపు బ్రేక్ ఫాస్ట్ చేసేవారిలో డయాబెటిస్ వచ్చే ముప్పు చాలా తక్కువ.



అలాగే రాత్రి ఆలస్యంగా భోజనం చేసేవారికి కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ.



రాత్రి 8 గంటల్లోపే భోజనం చేస్తే మధుమేహం వచ్చే ముప్పు తగ్గుతుంది.