కితకితలకు నవ్వెందుకు వస్తుంది? స్వయంగా పెట్టుకుంటే ఎందుకు రాదు?

ఎవరైనా మనకి చక్కిలిగిలి లేదా కితకితలు నవ్వు వస్తుంది. కానీ, మనం పెట్టుకుంటే రాదు ఎందుకు?

కితకితలకు కారణం మెదడులోని కార్టిక్స్, ఎంటీరియ సింగులెట్ కార్టిక్స్.

కార్టిక్స్ శరీర స్పర్శకు స్పందిస్తాయి. ఎంటీరియా సింగులెట్ సెన్సేషన్, ఆందాన్ని కలిగిస్తుంది.

మనకు ఎవరైనా కితకితలు పెడితే మెదడులోని సెరిబెల్మ్ భాగానికి సమాచారం అందుతుంది.

అది కార్టిక్స్‌‌కు ఒక సర్‌ప్రైజ్ లాంటింది. కితకితల సమాచారం అందగానే అది నవ్వు పుట్టిస్తుంది.

కానీ, మనం స్వయంగా కితకితలు పెట్టుకుంటే మాత్రం సెరిబెల్మ్‌ స్పందించదు.

ఎందుకంటే దానికి ముందుగానే మనం స్వయంగా కితకితలు పెట్టుకుంటున్నామని తెలిసిపోతుంది.

సెరిబెల్మ్ నుంచి సంకేతాలు రాకపోవడం వల్ల కార్టిక్స్‌కు ఎలాంటి సమాచారం అందదు. అందుకే మనకు నవ్వు రాదు.

Images Credit: Pexels