వాట్సాప్ తన యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే ‘Silencing Unknown Callers’ అనే ఫీచర్. అంటే మీరు సేవ్ చేయని నంబర్ల నుంచి కాల్స్ వస్తే ఫోన్ రింగ్ అవ్వదు అన్నమాట. గతంలో గుర్తు తెలియని నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. దీన్ని ఎనేబుల్ చేయాలంటే ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అందులో ‘ప్రైవసీ’పై క్లిక్ చేయాలి. కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ‘కాల్స్’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ‘Silence Unknown Calls’ ఎనేబుల్ చేసుకోవాలి. ఒకసారి మీరు దాన్ని ఎనేబుల్ చేస్తే కొత్త నంబర్ల నుంచి వచ్చే కాల్స్ రింగ్ అవ్వవు. కానీ మీకు కాలింగ్ హిస్టరీలో కనిపిస్తాయి.