వీటిని తింటే జుట్టు రాలిపోతుంది

మీరు తినే ఆహారమే జుట్టు ఎదుగుదలను నిర్ణయిస్తుంది.

అలాగే జుట్టు ఊడిపోవడానికి ఒత్తిడి, వారసత్వం ఎంత కారణమో అనారోగ్యకరమైన ఆహారాలు తినడం కూడా కారకమే.

కొన్ని రకాల ఆహారాలను దూరం పెట్టడం ద్వారా జుట్టు రాలడాన్ని అడ్డుకోవచ్చు.

పచ్చి కోడిగుడ్లను తినే అలవాటు చాలా మందికి ఉంది. కానీ కొందరిలో అది జుట్టురాలడానికి కారణమవుతుంది.

తీపి పదార్థాలు జుట్టును గుల్ల చేస్తాయి. శరీరంలో చక్కెర అధికంగా చేరితే ఇన్సులిన్ నిరోధకత పెరిగిపోతుంది. దీని వల్ల జుట్టు రాలిపోయే అవకాశం ఉంది.

గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ తక్కవగా ఉన్న ఆహారాలనే ఎంపిక చేసుకోవాలి. ఎక్కువగా ఉన్న ఆహారాలను తింటే జుట్టు రాలిపోవడం ఖాయం.

ఆల్కహాల్ తీసుకునే వారిలో కూడా జుట్టు రాలిపోవడం పెరుగుతుంది.

కూల్ డ్రింక్స్ వంటి శీతల పానీయాలు కూడా జుట్టు రాలేందుకు కారణమవుతాయి. వీటిలో చక్కెర అధికంగా ఉంటుంది.

జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు ఈ ఆహారపదార్థాలన్నింటినీ దూరంగా పెడితే మంచిది.