ముద్దుతో అందం అమాంతం పెరిగిపోతుంది ముద్దు ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. తెలుసుకుంటే మీరు రోజూ కచ్చితంగా మీ ప్రియమైనవారికి ముద్దులు పెడుతూనే ఉంటారు. ప్రేయసీ ప్రియులు, లేదా భార్యా భర్తల మధ్య ముద్దుకు మాత్రం చాలా ప్రాధాన్యత ఉందని చెబుతున్నాయి కొన్ని పరిశోధనలు. నేరుగా పెదాల మీద పెట్టే ముద్దుకు చాలా ప్రాధాన్యం ఉంది. ఆ జంటల ముఖాల్లో యవ్వన మెరుపు తొణికసలాడుతుంది. ఆ మెరుపు వల్ల వారి అందం రెట్టింపవుతుంది. రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా ముద్దు సాయపడుతుంది. ముద్దు పెట్టుకోవడం వల్ల 34 ముఖ కండరాలన్నింటిలోనూ కదలికలు వచ్చి బిగుతుగా మారతాయి. దీనివల్ల చర్మం కూడా బిగుతుగా అవుతుంది. ముద్దు వల్ల కండరాలలో కలిగే ఒత్తిడి చర్మాన్ని మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది. పెదవులు, నాలుక, బుగ్గలు, ముఖం, దవడలు, మెడ కండరాలకు మంచి వ్యాయామాన్ని ఇచ్చేది ముద్దే. ముఖంలో ఉండే అతి చిన్న ముఖ కండరాలు కూడా కిస్ చేసేటప్పుడు పనిచేస్తాయి కాబట్టి రక్తప్రసరణ పెరుగుతుంది. అప్పుడు ముఖంపై పడే ముడతలు తగ్గుతాయి. త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపించవు. మిమ్మల్ని యవ్వనంగా ఉంచేందుకు ముద్దు చాలా సహకరిస్తుంది.