మహేష్ బాబు కూతురు సితారకు చాలా మంది అభిమానులు ఉన్నారు. చిన్న వయసులోనే యూట్యూబ్ లో వీడియోలు, రీల్స్ చేస్తూ పాపులర్ అయింది. ఆమెకి లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. చూడడానికి అచ్చం తన తండ్రిలా ఉండే సితార.. ఫ్యూచర్ లో నటిగా మారే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక రీసెంట్ గానే క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న సితార.. దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు న్యూఇయర్ కి రెడీ అయిపోతుంది సితార. ఈ మేరకు ఓ ఫొటోషూట్ లో పాల్గొంది. వాటిని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో చిన్న స్కర్ట్ వేసుకొని సితార చాలా అందంగా, క్యూట్ గా కనిపిస్తోంది.