క్రాక్ - ఈ సినిమాకి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ముఖ్యంగా విలన్ రోల్ కి ఇచ్చే బీజియమ్ ఓ రేంజ్ లో ఉంటుంది. 



మాస్టర్ - ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అతడు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా సక్సెస్ లో కీలకపాత్ర పోషించింది. 



ఉప్పెన - ఈ సినిమాలో ప్రతి పాట అద్భుతంగా ఉంటుంది కానీ బీజియమ్ ఇంపాక్ట్ వేరే లెవెల్ లో ఉంటుంది. దేవిశ్రీప్రసాద్ ఆ రేంజ్ లో ఈ సినిమా కోసం పని చేశారు. 



వకీల్ సాబ్ - ఈ సినిమాలో కొన్ని పవర్ ఫుల్ సన్నివేశాలను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేశాడు తమన్.



లవ్ స్టోరీ - పవన్ అందించిన ఈ సినిమా మ్యూజిక్ చాలా ఏళ్లవరకు వినిపిస్తూనే ఉంటుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 



డాక్టర్ - ఈ సినిమాకి అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా స్టైలిష్ గా ఉంటూనే ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.



కురుప్ - ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగా ఎలివేట్ అయ్యాయంటే దానికి కారణం సుషిన్ శ్యామ్ అందించిన బీజియం అనే చెప్పాలి. 



అఖండ - ఈ సినిమా సక్సెస్ కి మెయిన్ రీజన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. తమన్ మోతకి థియేటర్లు దద్దరిల్లిపోయాయి.



పుష్ప - ఈ సినిమా మ్యూజిక్ కోసం దేవిశ్రీప్రసాద్ చాలా కష్టపడ్డాడు. దానికి తగ్గట్లే మంచి రెస్పాన్స్ వస్తోంది.