వీటిని రాత్రిపూట తింటే బరువు పెరగడం ఖాయం

శరీరబరువును అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. బరువు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యసమస్యలు కూడా పెరుగుతుంటాయి.

కొన్ని రకాల ఆహారాలు రాత్రి పూట తినకూడదు. కానీ ఈ విషయం తెలియక చాలా మంది తిని, బరువు పెరుగుతున్నారు.

టీ, కాఫీలలో కెలోరీలు, కెఫీన్ అధికంగా ఉంటుంది. వీటిని రాత్రి పూట తాగడం వల్ల ఆ కెలోరీలన్నీ శరీరంలో చేరతాయి. అంతేకాదు కెఫీన్ వల్ల నిద్ర సరిగా పట్టక బరువు పెరిగే అవకాశం ఉంది.

రాత్రి పూట పొట్ట నిండా చికెన్ బిర్యానీలు, మటన్ ఫ్రైలు తినేసి పడుకుంటే పొట్ట రావడం ఖాయం. ఎందుకంటే అవి త్వరగా జీర్ణం కావు, కొవ్వు రూపంలో పేరుకుపోతాయి.

క్యాబేజి, కాలీఫ్లవర్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. తిన్నా కూడా త్వరగా జీర్ణం కావు. కాబట్టి ఈ కూరలు మధ్యాహ్నం పూటే వండుకోవాలి.

రాత్రి ఆల్కహాల్ తాగేవారందరికీ అధికంగా పొట్ట పెరుగుతుంది. రాత్రిపూట మద్యాన్ని దూరం పెట్టాలి.