గత కొన్నేళ్లుగా మాంసం ప్రత్యామ్నాయాల కోసం పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే.
చాలా పరిశోధనల తరువాత మొక్కల ఆధారిత మాంసాన్ని తయారుచేశారు. దీన్నే వీగన్ మీట్ అని కూడా పిలుస్తారు.
తయారీలో సోయా బీన్స్, లెంటిల్స్, క్వినోవా, కోకోనట్ ఆయిల్, పచ్చిబఠాణీలు, ప్రోటీన్లు అధికంగా ఉండే కూరగాయలు, బియ్యం, గోధుమల్లోని గ్లూటెన్ వంటివి ఉపయోగిస్తారు.
అనేక పదార్థాలు ఉపయోగిస్తారు కాబట్టే సాధారణ మాంసం కన్నా ఇది చాలా ఎక్కువ రేటు ఉంటుంది.
మితంగా తింటే ఇది ఆరోగ్యకరమైనదే. వీటిలో అధిక ప్రోటీన్, తక్కువ సంతృప్త కొవ్వులు, తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది.
ఈ మాంసంలో సోడియం కంటెంట్ మాత్రం అధికంగా ఉంటుంది. సోడియం అధికంగా ఉంటుంది కాబట్టే చాలా మితంగా తినాలి.
దీన్ని సాధారణ మాంసంతో పోలిస్తే మాత్రం నిస్పందేహంగా దాని కన్నా ఆరోగ్యకరమైనదే.