సబ్బుల్లో ఈ రసాయనాలు ఉంటే డేంజర్

రంగు, వాసన ఆకర్షణీయంగా ఉంటే చాలు ఆ సబ్బును కొనేసే వాళ్లు ఎక్కువ మంది. కానీ ఆ సబ్బులో ఏమేం రసాయనాలు ఉన్నాయో ఎప్పుడైనా చెక్ చేశారా?

కొన్ని రకాల సబ్బులు ప్రమాదకరమైన రసాయనాలతో నిండి ఉంటాయి. అవి చర్మంలోకి చొచ్చుకెళ్లి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులను కలుగజేస్తాయి.

ఈ సబ్బు కవర్‌పై ఆ సబ్బు తయారీకి వాడిన ఉత్పత్తుల జాబితా ఉంటుంది. అందులో కొన్ని రకాల రసాయనాలు పేర్లు ఉంటే వాటిని తీసుకోకండి.

సబ్బులు లేదా కాస్మోటిక్స్ కవర్ పై PEG, పాలిథిలిన్, పాలిథిలిన్ గ్లైకాల్, పాలియోక్సీథైలీన్, -eth-, లేదా oxynol ఇలా ఏది కనిపించినా అందులో ‘1,4 డయాక్సేన్’ రసాయనం ఉన్నట్టే లెక్క.

సోడియం లారెత్ సల్ఫేట్ లేదా సోడియం లారిల్ సల్ఫేట్ ఈ రెండూ పేర్లు కూడా సబ్బులు, కాస్మోటిక్స్ లేబుళ్లపై ఉంటే దూరం పెట్టండి.

ట్రైక్లోసన్ అనే పురుగు మందును కూడా సబ్బుల్లో వాడతారు.

పారాబెన్‌లు వివిధ రకాల కాస్మోటిక్స్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పతుల్లో వాడుతుంటారు. ఇవి చాలా ప్రమాదకరమైనవి.

డయాజోలిడినైల్ యూరియా వంటివి ఫార్మాల్డిహైడ్ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఇది పైన చెప్పిన రసాయనాల కన్నా చాలా ప్రమాదకరమైనది.