కొన్ని ఆహారాలు కొందరిలో భయాన్ని (ఫోబియా) రెట్టింపు చేస్తాయి. అలాంటి ఫోబియాలు ఇవిగో...
చాక్లెట్లు అంటే భయంతో చచ్చేవాళ్లు ఉన్నారు. ఈ ఫోబియాను క్సోకోలాటోఫోబియా (Xocolatophobia)అని అంటారు.
పీనట్ బటర్ అంటే భయపడడాన్ని అరకిబ్యూటిరోఫోబియా (Arachibutyrophobia)అంటారు.
వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి అల్లియమ్ కుటుంబానికి చెందిన ఆహారాల వాసన, రూపం నచ్చకపోవడం కొందరిలో కలుగుతుంది. ఈ ఫోబియాను అలియంఫోబియా (Alliumphobia) అంటారు.
వంట అంటే మాత్రం చాలా భయపడిపోతారు కొంతమంది. వారికి ఉన్న ఈ ఫోబియాను మెజిరోకోఫోబియా (Mageirocophobia)అంటారు.