రైల్వే మటన్ కర్రీ... ఆ కాలం నాటి రైళ్లలో ఫేమస్ కూర ఈ కూరను పశ్చిమ రైల్వేలోని ‘ఫ్రాంటియర్ రైలు’లోని ఫస్ట్ క్లాస్ బోగీలో ప్రవేశపెట్టారు. రుచి అందరికీ నచ్చడంతో దేశవ్యాప్తంగా రైల్వే క్యాంటీన్లు, ఫస్ట్ క్లాస్ కోచ్‌లు, రైల్వే ఆఫీసర్ల క్లబ్‌లలో వండి వడ్డించారు. తొలిసారి ఈ కూరను పశ్చిమ రైల్వేలోని ‘ఫ్రాంటియర్ రైలు’లోని ఫస్ట్ క్లాస్ బోగీలో ప్రవేశపెట్టారు. ఫ్రాంటియర్ రైలులోని వంటగాళ్లు తమ కోసం మటన్ కర్రీ వండుకుంటున్నారు. ఒక బ్రిటిష్ అధికారి అనుకోకుండా వంటగదిలో వచ్చాడు. స్టవ్ మీద ఉడుకుతున్న కర్రీ వాసన చూసి మైమరిచిపోయాడు. దాన్ని అధికారులకు వడ్డించాలని ఆదేశించాడు. అలా ‘రైల్వే మటన్ కర్రీ’ అనే పేరు పుట్టింది. ఈ కూరను తక్కువ మసాలలో, ఎక్కువ కారం వేసి వండుతారు. అలాగే ఆవనూనె, నెయ్యిని వాడతారు.