ఉదయానే ఒక గుడ్డు తింటే ఏమవుతుంది?



రోజుకో గుడ్డు తినమని వైద్యులు చెబుతూనే ఉన్నారు. రోజు ఉదయానే ఒక గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసుకుందాం.



ఒక గుడ్డులో విటమిన్ ఎ, విటమిన్ బి5, విటమిన్ బి12, విటమిన్ డి, ఈ, కె, బి6, ఫోలేట్, ఫాస్పరస్, కాల్షియం, జింక్, ప్రొటీన్, సెలీనియం అధికంగా ఉంటాయి.



మనకు కావాల్సిన 9 అమైనో ఆమ్లాలు గుడ్డులో ఉంటాయి. కాబట్టి ఉదయానే కోడి గుడ్డు తినడం అలవాటు చేసుకోవాలి.



ప్రతిరోజూ ఉదయాన ఒక ఉడకబెట్టిన గుడ్డు తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ చేరుతుంది.



గుండెకు హాని చేసే ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించే శక్తి గుడ్డుకు ఉంది. గుడ్డు తినడం వల్ల గుండెపోటు రాకుండా అడ్డుకోవచ్చు.



వారంలో కనీసం మూడు నుంచి ఏడు గుడ్లను తినవచ్చు. ఒకేరోజు మాత్రం ఒక గుడ్డుకు మించి తినకపోతేనే మంచిది.



గుడ్లు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని 75 శాతం తగ్గించుకోవచ్చు.



కంటి ఆరోగ్యానికి కోడిగుడ్డు చాలా అవసరం. రోజుకో గుడ్డు తింటే కళ్లను కాపాడుకోవచ్చు.