వృశ్చిక రాశి వార ఫలాలు - జనవరి 08 to 14th ఈ వారం వృశ్చిక రాశివారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన పెట్టుబడులు లాభాన్నిస్తాయి. సకాలంలో నిర్ణయాలు తీసుకుని అమలుచేయండి. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. సినిమా, కళ, సంగీతం రంగాల్లో ఉండేవారు కీర్తి పొందుతారు ఉద్యోగులకు అదనపు బాధ్యతలుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువులతో మంచి సమన్వయం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. వారం ద్వితీయార్థంలో భూమి, భవన నిర్మాణ విషయాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ విజయం సాధిస్తారు. విద్యార్థులకు శుభ ఫలితాలున్నాయి. వృత్తి జీవితంలో ఇబ్బందులు వచ్చినా సమసిపోతాయి. Images Credit: Pixabay