తులా రాశి వార ఫలాలు - జనవరి 08 to 14th ఈ వారం తుల రాశి రాజకీయ నాయకులు ఏదో ఒత్తిడి మధ్య బిజీబిజీగా ఉంటారు ఈ వారం గ్రహాల సంచారం అంత అనకూల ఫలితాలను ఇవ్వడం లేదు. కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. అవగాహన లేని విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వారం మధ్యలో కొన్ని పనులు పూర్తిచేయడంలో ఇబ్బంది పడతారు కాస్త తెలివిగా ఆలోచించండి. వారం చివర్లో వైవాహిక జీవితంలో కొంత ప్రశాంతత ఉంటుంది. పిల్లల సానుకూల ప్రవర్తన మీలో సంతోషాన్ని నింపుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రణాళిక ప్రకారం పనులు చేస్తేనే పూర్తవుతాయి. Images Credit: Pixabay