సింహ రాశి వార ఫలాలు - జనవరి 08 to 14th ఈ వారం సింహ రాశి ప్రభుత్వ ఉద్యోగులు బదిలీకి సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది. చేపట్టే ప్రయత్నాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ వారం ఆరంభంలో ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ద్వితీయార్థంలో వైవాహిక బంధంలో సంతోషం ఉంటుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమయ్యే సూచనలున్నాయి. ఈ రాశి రాజకీయనాయకులు ప్రత్యర్థులను కరెక్టుగా టార్గెట్ చేయగలరు వారాంతంలో ఆనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి పూర్తిస్థాయిలో అవగాహన లేకుండా ఏ పనీ తలపెట్టవద్దు. Images Credit: Pixabay