వారఫలాలు( డిసెంబరు 12 to 18): తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం
తులా రాశి తులా రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. దీర్ఘకాలికంగా వెంటాడుతున్న సమస్యలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనుకున్నపనుల్లో ఆటంకాలు తప్పవు..ఓర్పుతో వ్యవహరిస్తేనే పూర్తిచేయగలరు.వివాదాల్లో తలదూర్చొద్దు.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. స్తిరాస్తుల కొనుగోలు వ్యవహారాలు ముందుకు సాగుతాయి.
వృశ్చిక రాశి ఈ రాశివారికి మంచి సమయం నడుస్తోంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వివాదాల నుంచి గెట్టెక్కుతారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. స్నేహితులను కలుస్తారు. ఉద్యోగులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. విదేశీ పర్యటనలకు అనుకూల సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు రాశి ఈ వారం మీకు శుభఫలితాలున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో, వ్యాపారంలో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి. రాజకీయ వర్గాల వారికి అనుకూల సమయం. నూతన కార్యక్రమాలు మొదలెట్టే ముందు ఓసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
మకర రాశి మకర రాశివారికి ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులు,సన్నిహితుల నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులున్నప్పటికీ అధిగమిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూల సమయం. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.
కుంభ రాశి ఈ వారం మీకు అనుకూలంగా ఉంది. ప్రారంభించిన ఏపని అయినా పూర్తిచేయగలుగుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మనోధైర్యంతో సమస్యలను అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
మీన రాశి ఈ వారం ఈ రాశివారికి అంతగా అనుకూల ఫలితాలు లేవు. అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగితేనే ప్రయోజనం ఉంటుంది. లౌక్యంగా వ్యవహరించడం వల్ల మంచి జరుగుతుంది. నలుగురిలో కలవడం, కలుపుకుని పోవడం చేస్తేనే మీకు మంచిది. ఆదాయానికి తగిన ఖర్చులుంటాయి.
నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు