మేష రాశి ఈ రాశివారు కుటుంబం నుంచి పూర్తి మద్దతు పొందుతారు. మీ గౌరవం పెరుగుతుంది. కుటుంబ ఫంక్షన్ లో బిజీగా ఉండవచ్చు. లావాదేవీలు జరపొద్దు. ఈ రోజు ప్రయాణాలకు చాలా అనుకూలమైన రోజు. విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ రోజు మీరు ఒక యాత్రకు వెళ్ళవచ్చు.
వృషభ రాశి ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. మీరు మీ పని మధ్య సమతుల్యత పాటిస్తారు. మీరు శక్తివంతంగా ఉంటారు. మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా ప్రయాణించడానికి ప్లాన్ చేస్తారు. మీ కృషికి తగిన ఫలితం పొందుతారు.
మిథున రాశి ఈ రోజు సూర్య భగవానుడి అనుగ్రహం మీపై ఉంటుంది. పిల్లల బాధ్యత నెరవేరుస్తారు. మీరు జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. మీరు పనిపై దృష్టి సారిస్తారు. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు.
కర్కాటక రాశి ఈ రోజు ఈ రాశివారికి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉంటుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. బద్ధకాన్ని విడండి. ఆరోగ్యం జాగ్రత్త
సింహ రాశి ఈ రాశివారికి ఈ రోజు శుభదినం. కుటుంబం నుంచి మీరు పూర్తి మద్దతు పొందుతారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. కుటుంబ కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. లావాదేవీలు చేయొద్దు. ఈ రోజు మీ కష్టానికి తగిన ఫలితం అందుతుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు ఉంటుంది.
కన్యా రాశి ఈ రోజు కన్యా రాశి వారు తమ వ్యాపారంలో పురోగతిని అనుభూతి చెందుతారు. సూర్యుడి కరుణా కటాక్షాలు మీపై ఉంటాయి. మీరు చేసే పనులను ఆలోచనాత్మకంగా చేయండి. వ్యాపారులు నిర్లక్షంగా ఉంటే నష్టపోకతప్పదు. అనవసరమైన హడావిడికి దూరంగా ఉండండి.
తులా రాశి ఈ రోజు మీ ప్రయాణానికి అవకాశాలున్నాయి. విద్య, జ్ఞానానికి సంబంధించిన రంగంలో విజయం సాధిస్తారు.అదృష్టం మీకు కలిసొస్తుంది. స్వతంత్ర్యంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
వృశ్చిక రాశి ఈ రోజు మీరు మీ ప్రేమికుడితో కలిసి ఎక్కడికైనా వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటారు. స్నేహితులను కలుస్తారు. వ్యాపారం బాగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.
ధనుస్సు రాశి ఈ రోజు మీ వైవాహిక సంబంధాలపై మీ ఆసక్తి తగ్గుతుంది. శాంతియుత వైవాహిక జీవితాన్ని కోరుకుంటే మీ వైఖరి , వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. గృహోపకరణాల పెరుగుదల ఉంటుంది.
మకర రాశి ఈ రోజు మీరు ఒక లేఖ లేదా ముఖ్యమైన సందేశాన్ని అందుకునే అవకాశం ఉంది. క్రయవిక్రయాలు చేయడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఒక ప్రణాళికపై పని ప్రారంభించడానికి, ప్రయాణించడానికి ఈ రోజు శుభదినం. ఈ రోజు కంటికి సంబంధించి ఇబ్బంది పడతారు.
కుంభ రాశి ఈ రోజు ఆర్థిక విషయాలలో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఏ పనిలోనైనా గొప్ప ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో తక్కువ కృషి నుంచి మంచి లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది.
మీన రాశి ఈ రోజు ముఖ్యమైన పని పూర్తి చేయడం వల్ల మీరు అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. మీ సామర్ధ్యం పెరుగుతుంది. వ్యక్తిగతంగా మీరు పురోగతి సాధిస్తారు. మీరు కుటుంబ వివాదాల నుండి స్వేచ్ఛను పొందుతారు.