వారఫలాలు( డిసెంబరు 12 to 18): మేషం, వృషభం, మిథునం, కర్కాటకం,సింహం, కన్య
మేష రాశి ఈ రాశివారు ఈ వారం ఓర్పుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి అడుగేయండి.
వృషభ రాశి వృషభరాశి వారు ఈ వారం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. అనుకున్న పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. మీ నుంచి సహాయం పొందినవారే అవసరానికి మిమ్మల్ని పట్టించుకోరు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.
మిథునం ఈ వారం మిథున రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ మోహమాటాన్ని దరిచేరనివ్వొద్దు. కొన్ని పనులు అనూహ్యంగా పూర్తవుతాయి. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. ఆస్తి వివాదాల్లో ఉన్నవారికి ఉపశమనం ఉంటుంది. స్తిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది.
కర్కాటక రాశి ఈ వారం కర్కాటక రాశివారికి గతవారంతో పోలిస్తే అనుకూల ఫలితాలున్నాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. అనుకున్న పనులు ఆటంకాలు లేకుండా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. నూతన పెట్టుబడులకు ఇదే మంచిసమయం. ఉద్యోగులు తమ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు.
సింహ రాశి ఈ వారం సింహరాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఉన్నత విద్యకోసం అడుగేసే విద్యార్థులకు మంచి రోజు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారులు లాభాలు పొందుతారు.కళారంగంలో ఉన్నవారికి అనుకూలమైన సమయం. ఆస్తి వివాదాలు పరిష్కరామవుతాయి. ఉద్యోగులు ఇబ్బందుల నుంచి బయటపడతారు.
కన్య ఈ వారం కన్యారాశివారికి గ్రహబలం బావుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. మీ మాటతీరుతో ఎంతటివారినైనా కట్టిపడేస్తారు. స్తిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో కీలక మార్పులుంటాయి. వ్యాపారం బాగాసాగుతుంది. ఖర్చులు తగ్గించండి. శత్రువులపై మీరు పైచేయి సాధిస్తారు.
నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
మిగిలిన ఆరు రాశుల ఫలితాలు తర్వాతి స్లైడ్స్ లో చూడొచ్చు....