బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారబోతుంది దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో సోమవారం ఉదయం అల్ప పీడనం ఏర్పడింది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడనుంది అదే దిశలో పయనిస్తూ తుపానుగా బలపడి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఎక్కువగా ఉత్తర కోస్తాలో స్వల్పంగా వర్షాలు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం తెలంగాణలో మాత్రం వర్షసూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో చలి తీవ్రత సాధారణంగా ఉండే అవకాశం ఉంది